Revanth:ప్రజాభిప్రాయ సేకరణకు గిగ్ అండ్ ప్లాట్ఫాం వర్కర్ల బిల్లు 8 d ago

featured-image

TG: రాష్ట్రంలో పనిచేస్తున్న గిగ్ ప్లాట్ఫాం వర్కర్లకు సంక్షేమం, సామాజిక భద్రత, బీమా తదితర సదుపాయాలు కల్పించేందుకు కార్మికశాఖ తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫాం వర్కర్ల ముసాయిదా బిల్లు రూపొందించింది. ఈ బిల్లుపై ఏప్రిల్ 28న లోపు అభ్యంతరాలు స్వీకరించి తుది ముసాయిదా సిద్ధం చేయనుంది. కార్మిక దినోత్సవం సందర్భంగా మే 1 నుంచే అమలు చేయానున్నట్లు సమాచారం.

కార్మికశాఖ మంత్రి ఛైర్మన్ బోర్డు..

ఈ బోర్డులో హైదరాబాద్ కేంద్రంగా పని చేయడానికి కార్మికశాఖ మంత్రి చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఒక CEO ని నియమిస్తారు. కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ ప్రతినిధి.. కార్మిక, ఐటీ, ఆర్థిక, వాణిజ్యపన్నులు, రవాణాశాఖ అధిపతులు, కార్మికశాఖ కమిషనర్ సభ్యులుగా వ్యవహరిస్తారు. బోర్డు CEO మెంబర్ సెక్రటరీగా కూడా ఉంటారు. పౌరసంఘాల నుంచి ఇద్దరు చొప్పున అభ్యర్థులను ప్రభుత్వం నామినేట్ చేయనుంది. కాగా, ఐటీ సాంకేతిక నిపుణుడు ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉండనున్నారు. అగ్రిగేటర్లు, పౌరసంఘాల నుంచి కనీసం ఒక మహిళ సభ్యురాలిగా వ్యవహరించాలి. ఈ సభ్యుల వ్యవధి 3 ఏళ్లు ఉంటుంది.

కానీ, చట్టం అమల్లోకి వచ్చిన 45 రోజుల్లోగా అగ్రిగేటర్లు, యాజమాన్యాలు ఈ సంక్షేమ బోర్డులో రిజిస్టర్ చేసుకోవాలి. తమ పేర్లు ఈ క్రమంలో నమోదు చేసుకునేందుకు సెల్ఫ్ రిజిస్టర్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తారు. ఈ వివరాలను బోర్డు వెబ్ సైట్ లో పొందుపరుస్తుంది. అగ్రిగేటర్లు.. ప్రతి మూడు నెలలకోసారి తమ వద్ద నమోదైన వర్కర్ల వివరాల్లో మార్పులు చేర్పులను బోర్డుకు అందజేయాలి. ప్రతి లావాదేవీకి చేసే చెల్లింపుల్లో 1శాతానికి తగ్గకుండా.. 2శాతానికి మించకుండా జమ చేయాలి. ఎవరైనా ఫీజును సంక్షేమ నిధికి చెల్లించకుంటే ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా రూ.2 లక్షల జరిమానా, లేదా రెండూ విధించే అంశాన్ని చట్టంలో పొందుపరిచారు.

ఇతర ప్రోత్సాహకాలపై ఫిర్యాదుల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమిస్తుంది. వెబ్ సైట్ లో బిల్లు.. ఈ బిల్లును కార్మికశాఖ... www.labour.telan- gana.gov.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. ఈ బిల్లుపై సూచనలు, సలహాలు, అభ్యంతరాలను ఏప్రిల్ 28న సాయంత్రం 5 గంటల వరకు ఈ- మెయిల్ ఐడీ tg.gig.labour@gmail.com ద్వారా లేదా పేపర్ పైన హైదరాబాద్ ర్టీసీ క్రాస్ రోడ్డులోని కార్మికశాఖ కమిషనర్ కార్యాలయంలో అందించాలని కమిషనర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మార్గదర్శకంగా ఉండాలి -సీఎం

తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫాం వర్కర్ల బిల్లు ముసాయిదాను వెంటనే ప్రజాభిప్రాయ సేకరణకు అందుబాటులో ఉంచాలని సీఎం రేవంత్ రెడ్డి కార్మికశాఖ అధికారులను ఆదేశించారు. ముసాయిదా బిల్లులోని అంశాలను అధికారులు వివరించగా.. అనేక మార్పులు చేయాలని సీఎం ఆదేశించారు. "రాష్ట్రంలో 4 లక్షల మంది రవాణా, ఆహారం-ప్యాకేజ్డ్ డెలివరీల్లో గిగ్ వర్కర్ లాగా పనిచేస్తున్నారు. వీరి భద్రతకు చట్టం తెస్తామని ఎన్నికలకు ముందే హామీ ఇచ్చినట్లే.. దేశంలోనే మొదటిసారిగా గిగ్ వర్కర్లకు రూ. 5 లక్షల ప్రమాద బీమా వర్తించేలా 2023లో ఉత్తర్వులు జారీచేశామన్నారు. ప్రభుత్వం రూపొందించే కొత్త చట్టం దేశానికి మార్గదర్శకంగా ఉండాలి" అని రేవంత్ సూచించారు.

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD